హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్ట్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. రాహుల్ అరెస్టుకు నిరసనగా బుధవారం 'చలో లోక్ భవన్' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటలకు నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని, అక్కడి నుంచి ర్యాలీగా లోక్ భవన్‌కు వెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో మీడియాకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ర్యాలీలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీతో పాటు ఎంపీ ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసి జైలుకు తరలించడం దుర్మార్గమని ఫైర్అయ్యారు. నీట్ పరీక్ష పేపర్ లీక్‌పై సమగ్ర దర్యాప్తు చేయాలని రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో డిమాండ్ చేశారని, అందుకే బీజేపీ ప్రభుత్వం భయపడి ఈ చర్యలకు దిగిందని ఆరోపించారు
