
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ కవితపై మల్లన్న కామెంట్లను ఖండిస్తున్నామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం మన సంప్రదాయమని తెలిపారు. కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. మల్లన్న ఆఫీస్‌పై దాడి చట్ట వ్యతిరేకమన్నారు. ఈ వ్యవహారం చట్టం చూసుకుంటుందని తెలిపారు.
మల్లన్న ఆఫీస్‌పై దాడి, గన్ మెన్ కాల్పులు అంశాలపై వచ్చిన ఫిర్యాదులు చట్టపరిధిలోనివి అని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ కృషి ఫలితమే బీసీ బిల్లు, రిజర్వేషన్లు అని, బీసీ రిజర్వేషన్ల అంశంలో ఇతరులు లబ్ధిపొందాలని చూడటం సరికాదన్నారు.