ఖమ్మం టౌన్, వెలుగు: రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న వ్యక్తిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఖమ్మం నగరానికి చెందిన ఆత్మకూరి జగదీశ్ రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నాడు. ఆయనపై ఖమ్మం జిల్లాలో 13 కేసులు, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో మరో రెండు కేసులు నమోదయ్యాయి.
శుక్రవారం ఇతడినిపై పీడీ యాక్ట్ నమోదు చేసి హైదరాబాద్ చంచలగూడ సెంట్రల్ జైలుకు తరలించినట్లు సీపీ సునీల్‌దత్ తెలిపారు. దీర్ఘకాలంగా రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ తరచూ పోలీసులకు చిక్కుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

