సుల్తానాబాద్, వెలుగు: కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బీమా సదుపాయాలు అందేలా కృషి చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఐఎన్టీయూసీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నియమితులైన నీరటి శంకర్ మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎంపీ వంశీకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా శంకర్‌ను ఎంపీ అభినందిస్తూ, ఐటీఎన్టీయూసీ పటిష్టతకు కృషి చేయాలన్నారు.
