Peddi Tickets: ఏపీలో హాట్ కేకుల్లా అమ్ముడైన 'పెద్ది' టికెట్స్.. లక్షల డాలర్లలో ఓవర్సీస్‌ వసూళ్లు!

Peddi Tickets: ఏపీలో హాట్ కేకుల్లా అమ్ముడైన 'పెద్ది' టికెట్స్.. లక్షల డాలర్లలో ఓవర్సీస్‌ వసూళ్లు!

 బుచ్చిబాబు సన దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ ప్యాన్ ఇండియా చిత్రం'పెద్ది' (Peddi).  రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో వస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించడానికి రెడీ అయిపోయింది. జూన్ 4, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుండగా, థియేటర్లలో రచ్చ అప్పుడే మొదలైపోయింది. టిక్కెట్లు హాట్ కేక్ ల్లా సెల్ అవుతున్నాయి.

అడ్వాన్స్ బుకింగ్స్ షురూ..

ఆంధ్రప్రదేశ్‌లో 'పెద్ది' అడ్వాన్స్ బుకింగ్స్ అఫీషియల్‌గా ఓపెన్ అయ్యాయి. మొదటగా 'డిస్ట్రిక్ట్ యాప్' (District App) లో, ఆ తర్వాత 'బుక్‌మైషో'లో టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చారు. విజయవాడ, వైజాగ్, నెల్లూరు, గుంటూరు, ఒంగోలు, అనంతపురం, తిరుపతి, కాకినాడ వంటి ప్రధాన కేంద్రాలలో బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల వ్యవధిలోనే టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. బుక్‌మైషోలో ఈ చిత్రం గంటగంటకూ టాప్ ట్రెండింగ్‌లోకి దూసుకెళ్తోంది. ఇక తెలంగాణ ఫ్యాన్స్ కూడా టికెట్ల కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అక్కడ టికెట్ ధరల పెంపు జీవో (GO) రాగానే బుకింగ్స్ షురూ కానున్నాయి.

ఓవర్సీస్‌లో ఊచకోత.. 

ఇండియాలోనే కాదు, ఓవర్సీస్‌లోనూ రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అవుతోంది. నార్త్ అమెరికా ప్రీ-సేల్స్‌లోనే ఈ సినిమా అప్పుడే 8 లక్షల డాలర్లు మార్కును దాటేసి సంచలనం సృష్టించింది. జూన్ 3న పడే ప్రీమియర్ షోల కంటే ముందే ఈజీగా1 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 'రంగస్థలం' తర్వాత చరణ్ ఊరమాస్ లుక్‌లో నటిస్తుండటంతో యూఎస్ఏ (USA) ట్రేడ్ వర్గాలు కూడా ఈ ఓపెనింగ్స్ చూసి నోరెళ్లబెడుతున్నాయి.

క్రేజీ కాంబో.. 

జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచి సినిమాపై అంచనాలను రెట్టింపు స్థాయికి తీసుకెళ్లాయి. అంతేకాదు, ఈ సినిమాలో కన్నడ సెన్సేషన్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు, జగపతి బాబు, బోమన్ ఇరానీ, టిన్నూ ఆనంద్ వంటి భారీ తారాగణం నటించారు. వీరికి తోడు శృతి హాసన్ ఒక స్పెషల్ రోల్‌లో మెరవనుండటం సినిమాకే హైలైట్ కానుంది.

గ్లోబల్ స్టార్ మాస్ జాతరను థియేటర్లలో చూడటానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయింది. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 3న పెయిడ్ ప్రివ్యూలతోనే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి..