బెజవాడలో రామ్ చరణ్.. 'పెద్ది' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు పోటెత్తిన అభిమానులు.. ఎయిర్‌పోర్ట్ టు స్టేడియం భారీ బైక్ ర్యాలీ!

బెజవాడలో రామ్ చరణ్.. 'పెద్ది' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు పోటెత్తిన అభిమానులు.. ఎయిర్‌పోర్ట్ టు స్టేడియం భారీ బైక్ ర్యాలీ!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ప్యాన్ ఇండియా మూవీ 'పెద్ది' (Peddi). జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ రోజు ( జూన్ 1 ) విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో బెజవాడ నగరం మొత్తం రామ్ చరణ్ నామస్మరణతో మారుమోగిపోతోంది.

ఈ మెగా సంబరాల్లో భాగంగా చిత్ర యూనిట్‌కు స్వాగతం పలుకుతూ అభిమానులు భారీ హంగామా సృష్టించారు. మధ్యాహ్నం 3:00 గంటలకే గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఫ్యాన్స్  రామ్ చరణ్‌తో పాటు చిత్ర యూనిట్ కు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఈవెంట్ వేదిక వరకు వేలాది బైక్‌లతో నిర్వహించిన మెగా బైక్ ర్యాలీ నిర్వహించారు. చరణ్ లుక్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడటంతో విజయవాడ పురవీధులన్నీ జనసంద్రంగా మారాయి. 

 

మరోవైపు, స్టేడియం పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. సాయంత్రం 5:00 గంటలకే స్టేడియం లోపల ప్రతి సీటూ నిండిపోయింది. పాసులు ఉండి కూడా వేలాది మంది అభిమానులు లోపలికి వెళ్లలేక బయటే ఉండిపోవాల్సి వచ్చింది. తమ అభిమాన హీరోను చూసే అవకాశం కోల్పోవడంతో కొందరు తీవ్ర నిరాశ వ్యక్తం చేసినప్పటికీ, బయట స్క్రీన్స్ ద్వారా ఈ వేడుకను వీక్షిస్తూ సందడి చేస్తున్నారు.

 

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతం, జాన్వీ కపూర్ గ్లామర్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు వంటి హేమాహేమీల నటన ఈ చిత్రంపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేశాయి. వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. నేటి ఈవెంట్‌తో 'పెద్ది' తుఫాన్ థియేటర్లలోకి రాకముందే మొదలైందని స్పష్టమవుతోంది.