హైదరాబాద్, వెలుగు: సాఫ్ట్వేర్ సేవలు అందించే పెగాసిస్టమ్స్ బెంగళూరులో కొత్త ఆఫీసును ప్రారంభించింది. రూ.60 కోట్లకు పైగా పెట్టుబడితో ఎకోవరల్డ్ టెక్ పార్క్‌లో ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిక్యూటివ్ బ్రీఫింగ్ సెంటర్ ద్వారా క్లయింట్లతో చర్చలు జరపనున్నారు. ఈ క్యాంపస్‌లో 350 మందికి పైగా కూర్చునే అవకాశం ఉంది. 35కు పైగా సమావేశ గదులు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ కార్యాలయం పెగా గ్లోబల్ ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషించనుంది. ఆసియా– పసిఫిక్ ప్రాంతంలో వ్యాపార వృద్ధికి ఇది గమ్యస్థానంగా మారుతుంది. కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఈ సెంటర్ప్రారంభించారు.
