ఢిల్లీని వదలని పొగమంచు

ఢిల్లీని వదలని పొగమంచు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చలి తీవ్రత కొనసాగుతోంది. పొగమంచు భారీగా కురుస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉదయం 9 గంటలైనా మంచు తేరుకోవడం లేదు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఢిల్లీలో గాలి నాణ్యత కూడా పడిపోయింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. మూడ్నాలుగు రోజులుగా కాస్త తగ్గినట్టు అనిపించినా చలి పులి మళ్లీ పంజా విసురుతోంది. చాలా ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచే దట్టమైన పొగమంచు అలుముకుంటోంది. చలి తీవ్రతను తట్టుకోలేక జనం చలి మంటలు వేసుకుంటున్నారు. తెల్లవారుజామున 8 దాటినా సూర్య కిరణాలు కనిపించడం లేదు. దీంతో వివిధ పనుల కోసం వాహనాలపై వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు కోరారు.

మరిన్ని వార్తల కోసం: 

ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కు షాక్!

మస్తు తాగిన్రు.. ఫుల్ డ్రంక్ అండ్ డ్రైవ్స్