కరోనా ఎఫెక్ట్: ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా

కరోనా ఎఫెక్ట్: ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా

హైదరాబాద్: సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. ఈ విజువల్ వండర్ విడుదల వాయిదా పడింది. ఈ నెల 7 న రిలీజ్ కావాల్సిన ఆర్ఆర్ఆర్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటిచింది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు రాజమౌళి తెలిపారు. దేశ రాజధానిలో ఢిల్లీలో ఎల్లో అలర్ట్ విధించడం, మహారాష్ట్రలో ఒక్క రోజే 8 వేల కరోనా కేసులు నమోదవడంతో ముంబైలో సినిమా హాళ్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఢిల్లీలో కూడా థియేటర్లు మూతబడ్డాయి. 

ఏపీలోనూ టిక్కెట్ ధరల వ్యవహారం కొనసాగుతోంది. ఈ క్రమంలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆర్ఆర్ఆర్ ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ కూడా పోస్ట్ పోన్ అవుతుందని వినిపిస్తోంది. కానీ తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన వలిమై మాత్రం అనుకున్న డేట్ కే భారీ స్థాయిలో విడుదలవుతుందని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

కాగా, అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ కోసం డైరెక్టర్ రాజమౌళి నెల రోజుల నుంచి ఇండియా వైడ్ ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు. కానీ తాజాగా సినిమాను వాయిదా వేయడంతో ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ మూవీలో అలియా భట్‌, ఒలివియా మోరీస్‌, శ్రియా శరణ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి బాణీలు సమకూర్చారు. 

మరిన్ని వార్తల కోసం: 

దొంగ అని పొరబడి.. కూతురిని కాల్చేసిండు

గోవింద నామస్మరణతో కొత్తేడాది వేడుకలు