ప్రజలు రాజ్‌భవన్‌ను ఘెరావ్ చేస్తారేమో!: గెహ్లాట్

ప్రజలు రాజ్‌భవన్‌ను ఘెరావ్ చేస్తారేమో!: గెహ్లాట్

న్యూఢిల్లీ: అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేయాలని తాము పదే పదే కోరుతున్నప్పటికీ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా స్పందించడం లేదని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. ఒకవేళ ప్రజలు రాజ్‌భవన్‌ను ఘెరావ్ చేస్తే దానికి ప్రభుత్వం ఎలాంటి బాధ్యత వహించబోదని చెప్పారు. ‘సెషన్స్‌ ఏర్పాటుకు గవర్నర్ ఆదేశించకపోవడానికి ఎలాంటి ఒత్తిళ్లు పని చేస్తున్నాయో అర్థం కావడం లేదు. ఒకవేళ రాష్ట్ర ప్రజలు రేపు రాజ్‌భవన్‌ను ఘెరావ్ చేస్తే దానికి మేం బాధ్యలం కాబోం’ అని గెహ్లాట్ పేర్కొన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో కరోనా వైరస్, రాజకీయ పరిస్థితుల గురించి చర్చిస్తామని గెహ్లాట్ చెప్పారు. అసెంబ్లీ సమావేశాల గురించి గత రాత్రే ఆదేశాలు జారీ చేయాల్సి ఉన్నా అవి ఇష్యూ కాలేదన్నారు. ఒకవేళ ఉత్తర్వులు జారీ కాకపోతే నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యేలతో కలసి గవర్నర్‌‌కు విజ్ఞప్తి చేస్తామని వివరించారు. సోమవారం నుంచి అసెంబ్లీ సెషన్ జరగాలని తాము కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.