కేరళ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ఎంపీ శశి థరూర్

కేరళ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ఎంపీ శశి థరూర్

న్యూఢిల్లీ: కేరళ ఓటర్లు మార్పు కోరుకుంటూ స్పష్టమైన తీర్పు ఇచ్చారని కాంగ్రెస్​ సీనియర్​ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ వ్యాఖ్యానించారు. యూడీఎఫ్ కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, ఒక చారిత్రక మెజారిటీని సాధించిందని ఆయన పేర్కొన్నారు. కేరళ రిజల్ట్స్​ అనంతరం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు.

 అధికార కూటమికి చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా ప్రజాదరణ పొంది ఉండవచ్చు.. కానీ, ప్రజలు మాత్రం ప్రస్తుత ‘దుష్పరిపాలన’ కొనసాగకూడదని నిర్ణయించుకున్నారని థరూర్ అన్నారు. ఇది కేరళ ఓటర్ల పరిణతికి నిదర్శనమని ఆయన కొనియాడారు. యూడీఎఫ్ విజయం సాధిస్తుందని ముందే ఊహించినప్పటికీ.. తాము ఆశించిన దానికంటే చాలా మెరుగ్గా ఫలితాలు వచ్చాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.