Expired Chocolates:ఇంత కక్కుర్తి ఏందిర నాయనా..డంపింక్ యార్డులో కుప్పలుగా ఎక్స్పైర్డ్ చాక్లెట్లు ..ఏరుకునేందుకు ఎగబడ్డ జనం

Expired Chocolates:ఇంత కక్కుర్తి ఏందిర నాయనా..డంపింక్ యార్డులో కుప్పలుగా ఎక్స్పైర్డ్ చాక్లెట్లు ..ఏరుకునేందుకు ఎగబడ్డ జనం

డింపింగ్ యార్డులో కుప్పలుగా చాక్లెట్లు.. అవి ఫేమస్ కంపెనీ చాక్లెట్లు.. జనం వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. అట్ల ఇట్ల కాదు.. ఎవరు పోశారు.. ఎందుకు పోశారు.. అనేది ఏదీ ఆలోచించలేదు.  బస్తాలు, బ్యాగులు, పెట్టెలు, బండి  డిక్కీల్లో చాక్లెట్లను నింపుకు పోయిన్రు. ఆ సమయంలో డంపింగ్ యార్డులో జాతర సాగిందనుకోండి.. అంత జనం ఎగబడ్డరు. పుకట్ కు వస్తే  ఫినాయిల్ తాగుతాడురా వీడు అనే మాట మనం తరుచుగా వింటుంటాం..ఈ సామెత పక్కా వీళ్లకు సరిపోతుంది. డంపింగ్ యార్డులో పారబోసిన చాక్లెట్లను ఏరుకుంటున్న జనానికి సంబంధించిన వీడియో  ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ లోఅవుతోంది. ఇంత కక్కుర్తి ఏందిరా నాయనా అని నెటిజన్లు నానా రకాల కామెంట్లు పెడుతున్నారు. 

వైరల్ అవుతున్న వీడియో  కాన్పూర్ కు చెందిన ఓ కంపెనీ చాక్లెట్లను డంపింగ్ యార్డులో కుప్పులుగా పారబోశారు. అది చూసిన జనం చాక్లెట్లను ఏరుకునేందుకు ఎగబ్డడారు. కొందరు సంచుల్లో, ఇంకొందరు బ్యాగుల్లో,  మరికొందరు బైకు డిక్కీల్లో నింపుకుపోయారు. చాక్లెట్లకోసం జాతరకు వచ్చినట్లు తరలివచ్చారు. కావాల్సినన్నీ చాక్లెట్లు పట్టుకుపోయారు.  ఇదంతా అక్కడున్న కొందరు  సెల్ ఫోన్లో బంధించి సోషల్  మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. 
  
కాన్పూర్ కు చెందిన ఓ చాక్లెట్ల కంపెనీ  కాలం ఎక్స్ పైర్డ్ అయిన చాక్లెట్లను సమీప డంపింగ్ యార్డులో పడేసింది. అది ఒకటి రెండు కాదు.. పెద్ద పెద్ద కుప్పులుగా చాక్లెట్లను వదిలేసింది. అయితే ఇదంతా గమనించని జనం వాటికోసం ఎగబడ్డారు. తీరా ఒకాయన ఎందుకు పారబోశారు అని అనుమానం వచ్చి ఎక్స్ పైర్డ్ డేట్ చెక్ చేయగా అవి 2024లో తయారయ్యాయి. ఇప్పటికే కాలం చెల్లిపోయాయి. అక్కడ చాక్లెట్లు ఏరుకుంటున్న వారిని హెచ్చరించేందుకు ప్రయత్నించాడు. కానీ ఆయన మాట ఎవరూ వినలేదు. దీంతో వీడియో తీసి సోషల్  మీడియాలో పెట్టడంతో  డంపింగ్ యార్డులో చాక్లెట్లు కక్కుర్తితో ఏరుకుంటున్న జనం తీరు చర్చనీయింశమైంది. 

ALSO READ : ఆన్‌లైన్‌లో ఈ పండ్ల పై బ్యాన్.. 

తినేదయితే చాలు.. అది ఎక్కడ ఉంటేందీ.. ఎలా ఉంటేందీ..  పుకట్ కు వస్తుంది కదా  దొరికిన కాడిని దోచుకోవడమే అని జనం చాక్లెట్ల కోసం ఎగబడిన తీరు నెటిజన్లలో చర్చనీయాంశమైంది. అవి ఎందుకు పారబోశారు.. తింటే ఏదైనా ప్రమాదమా.. ఒక్కసారే ఇన్ని చాక్లెట్లు కుప్పలుగా ఎందుకు  డంపింగ్ యార్డులో పోశారు.. ఏదీ ఆలోచించకుండా జనం చాక్లెట్లను తీసుకెళ్తున్న తీరు చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.