లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని కోరుతూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. చేస్తూ ట్వీట్ చేశారు. లాక్‌డౌన్ అనేది చాలా అరుదుగా తీసుకునే చర్య అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంత తీవ్రమైన నిర్ణయం తీసుకుంది అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలన్నారు. నువ్వు బ్రతకడానికి, తోటి వారికి బ్రతికే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ వైరస్ అంతమయ్యే వరకు స్వీయ క్రమశిక్షణ పాటించాల్సిందే నంటూ ట్విట్టర్ స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.
LOCK OUT అనేది చాలా అరుదుగా తీసుకునే చర్య. ప్రభుత్వం అంత తీవ్రమైన నిర్ణయం తీసుకుంది అంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవాలి
నువ్వు బ్రతకడానికి, తోటివారికి బ్రతికే అవకాశం ఇవ్వడానికి ఈ వైరస్ అంతమయ్యే వరకు స్వీయ క్రమశిక్షణ పాటించాల్సిందే#TelanganaFightsCorona #BreakTheChain pic.twitter.com/7JX52KhcT5
— KTR (@KTRTRS) March 23, 2020
