ఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధరపై 2 రూపాయల 61 పైసలు, లీటర్ డీజిల్పై 2 రూపాయల 71 పైసలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు సోమవారం ఉదయం నుంచే అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Diesel prices increased by Rs. 2.71 per litre and petrol by Rs. 2.61 per litre. Diesel in Delhi hiked to Rs 95.20 per litre, and Petrol hiked to Rs 102.12.
— ANI (@ANI) May 25, 2026
ఈ పెంపుతో.. 11 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలను నాలుగు సార్లు పెంచడం గమనార్హం. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 102 రూపాయల 12 పైసలకు, లీటర్ డీజిల్ ధర 95 రూపాయల 20 పైసలకు చేరింది.
ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు శనివారమే పెట్రోల్ ధరను 87 పైసలు, డీజిల్ ధరను 91 పైసల చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. కేవలం.. రెండు రోజుల వ్యవధిలో.. సోమవారం మళ్లీ ఇంధన ధరలను పెంచడం గమనార్హం.
పశ్చిమాసియా యుద్ధం, ఇంధన కొరత, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో నష్టాన్ని పూడ్చుకునేందుకని ఆయిల్ కంపెనీలు మే 15వ తేదీ నుంచి వరుసగా నాలుగు రోజులకోసారి ధరలను పెంచాయి. తాజాగా సోమవారం నాటి పెంపుతో రెండు వారాల్లోనే ఇంధన ధరలు నాలుగోసారి పెరగడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా, కేంద్రం పెట్రోల్‌పై లీటరుకు రూ. 24 వరకు, డీజిల్‌పై లీటరుకు రూ. 30 వరకు ధరల వ్యత్యాసాన్ని పరోక్షంగా భరించిందని తెలిపాయి.
2021, 2024 మధ్య కాలంలో చమురు సంస్థలు రూ. 24,500 కోట్ల మేర నష్టాలను చవిచూశాయని, ఎల్ పీజీ వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి 2024-–25లో రూ. 40,000 కోట్ల భారాన్ని భరించాయని పేర్కొన్నాయి.
