నేపాల్ లో తగ్గిన పెట్రో ధరలు

నేపాల్ లో తగ్గిన పెట్రో ధరలు
  • పెరిగిన ఎల్పీజీ

ఖాట్మాండు: నేపాల్​లో ఇంధన ధరలను ఆ దేశ ఆయి ల్ కార్పొరేషన్ సర్దుబాటు చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గగా.. ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. పెట్రోల్​పై లీటరుకు రూ.2, డీజిల్​పై రూ.12 తగ్గిస్తూ ఆయిల్ కార్పొరేషన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

దీంతో పెట్రోల్ ధర లీటరుకు రూ.214.50, డీజిల్ రూ.222.50కు చేరింది. అదేవిధంగా వంటగ్యాస్, విమాన ఇంధన ధరలను పెంచింది. డొమెస్టిక్ ఫ్యుయెల్​పై లీటరుకు రూ.7 పెంచగా.. సిలిండర్​పై రూ.150 పెంచింది. దీంతో వంటగ్యాస్  ధర రూ.2,160కు చేరినట్లయింది. పెరిగిన ధరలు శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి అమల్లోకి వచ్చాయని నేపాల్  ఆయిల్ కార్పొరేషన్  వెల్లడించింది.