రూ.2 వేల నోటు ఇస్తే.. 1500 పెట్రోల్ కొట్టించాల్సిందే!

రూ.2 వేల నోటు ఇస్తే.. 1500 పెట్రోల్ కొట్టించాల్సిందే!

రూ.2 వేల నోటును ఉపసంహరించుకున్న ఆర్బీఐ వాటిని బ్యాంక్​లో ఎక్స్ చేంజ్, డిపాజిట్ చేసుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే.  అయితే, ఇప్పటికే కొన్ని కిరాణా షాప్​లు, వైన్స్, పెట్రోల్ బంకుల్లో రూ.2 వేల నోటును తీసుకోవడం లేదు.

మరికొన్ని పెట్రోల్ బంకుల్లో రూ.2 వేల నోటును తీసుకునేందుకు షరతులు పెడుతున్నారు. వాహనదారుడు రూ.వెయ్యికిపైగా పెట్రోల్ కొట్టించుకుంటేనే రూ.2 వేల నోటును తీస్కుంటామంటూ నోటీసు అంటించారు. - వెలుగు, పద్మారావునగర్