గురుకుల పీఈటీ నియామకాలను చేపట్టాలి

గురుకుల పీఈటీ నియామకాలను చేపట్టాలి
  •  బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్

బషీర్​బాగ్, వెలుగు: హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి 2017 గురుకుల పీఈటీ నియామకాలను వెంటనే  చేపట్టాలని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన స్టూడెంట్లతో కలిసి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్​పార్కులోని అమరవీరుల స్థూపం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ.. గురుకుల పీఈటీ నియామకాలకు 2017లో  రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చి 2018లో ఫలితాలు విడుదల చేసిందని, కానీ కోర్టు కేసుల కారణంగా నియామకాలు చేపట్టలేదన్నారు.

 ఈ నేపథ్యంలోనే కోర్టు తీర్పు అభ్యర్థులకు అనుకూలంగా వచ్చి  2 నెలలు గడుస్తున్నా నియామకాలు చేపట్టకుండా అభ్యర్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడ్డారు. ఐదేండ్లుగా ఫలితాలు వెల్లడించకపోవడంతో మనస్తాపానికి గురై 8 మంది పీఈటీ అభ్యర్థులు సూసైడ్ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.   వెంటనే నియామకాలు చేపట్టాలన్నారు.