ఇక నుంచి 25 వేల బేసిక్పై పీఎఫ్.. రూ.15 వేల నుంచి లిమిట్ పెంచిన కేంద్రం

ఇక నుంచి 25 వేల బేసిక్పై పీఎఫ్.. రూ.15 వేల నుంచి లిమిట్ పెంచిన కేంద్రం
  • పెరగనున్న పీఎఫ్​.. 
  • తగ్గనున్న టేక్​ హోం సాలరీ
  • 15–25వేల బేసిక్​ సాలరీ ఉన్న ఉద్యోగులకు లాభం 

న్యూఢిల్లీ:  ఇక నుంచి ఉద్యోగుల టేక్ హోమ్  సాలరీ తగ్గనుంది. కానీ, వారి పీఎఫ్ అకౌంట్‌‌‌‌లో జమ అయ్యే అమౌంట్ మాత్రం పెరగనుంది. ఇప్పటివరకు రూ.15 వేల కంటే ఎంత ఎక్కువ బేసిక్ సాలరీ ఉన్నా, రూ.15 వేల పైనే 12 శాతం ఎంప్లాయీస్‌‌‌‌ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌‌‌‌), ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కంట్రిబ్యూషన్‌‌‌‌ను లెక్కించేవారు.

ప్రభుత్వం ఈ గరిష్ట పరిమితిని రూ.25 వేలకు పెంచడంతో పీఎఫ్ కంట్రిబ్యూషన్ పెరగనుంది.ముఖ్యంగా  రూ.15 వేల నుంచి రూ.25 వేల మధ్య బేసిక్ శాలరీ అందుకునే ఉద్యోగుల పీఎఫ్‌‌‌‌ అకౌంట్‌‌‌‌లో ఎక్కువ అమౌంట్ జమ అవుతుంది. రూ.25 వేల కంటే ఎక్కువ బేసిక్ సాలరీ ఉన్న ఉద్యోగుల పీఎఫ్‌‌‌‌, ఈపీఎస్ అమౌంట్‌‌‌‌ను రూ.25 వేల పైనే లెక్కిస్తారు.     కేంద్ర కార్మిక శాఖ చేసిన ఈ  ప్రతిపాదనకు కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. రూ.15 వేల లిమిట్‌‌‌‌ను 2014 నుంచి మార్చలేదు. తాజాగా మార్చడంతో దాదాపు 51 లక్షల మంది ఉద్యోగులు ఎక్కువగా లబ్ధి పొందుతారు.

ఇప్పటివరకు రూ.15 వేల కంటే ఎక్కువ బేసిక్ సాలరీ ఉన్నా ఉద్యోగుల సాలరీ నుంచి గరిష్టంగా రూ.1,800 మాత్రమే కట్ అయ్యేది. ఎంప్లాయర్ గరిష్టంగా రూ.1,250 ఈపీఎస్‌‌‌‌ కోసం,  రూ.550 ఈపీఎఫ్​ కోసం కంట్రిబ్యూట్ చే సేవారు.  రూ. తాజాగా లిమిట్ పెంచడంతో  రూ.25 వేల కంటే ఎక్కువ బేసిక్ సాలరీ ఉన్న ఉద్యోగుల సాలరీ నుంచి గరిష్టంగా రూ.3 వేలు కట్ అవుతుంది.  ఇంతే స్థాయిలో ఎంప్లాయర్ కూడా ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్‌‌‌‌కు జమ చేస్తారు. ఈపీఎస్ కింద గరిష్టంగా రూ.2,080, ఈపీఎఫ్‌‌‌‌ కింద గరిష్టంగా  రూ.920 జమ చేస్తారు. 

తగ్గనున్న టేక్ హోమ్ సాలరీ

పీఎఫ్ అమౌంట్ గతంలో కంటే ఎక్కువ కట్ కానుండడంతో ఉద్యోగులకు వచ్చే నెట్ సాలరీ మాత్రం తగ్గుతుంది. రూ.15 వేల కంటే తక్కువ బేసిక్ సాలరీ ఉన్న ఉద్యోగులపై ఎటువంటి ప్రభావం ఉండదు. వీరి పీఎఫ్‌‌‌‌ను ముందు నుంచి రూ.15 వేల లిమిట్‌‌‌‌పైనే లెక్కిస్తున్నారు. కొన్ని కార్పొరేట్ కంపెనీలు లిమిట్‌‌‌‌కి బదులు  తమ ఉద్యోగులకు ఇచ్చే అసలు బేసిక్ సాలరీపైనే పీఎఫ్ లెక్కిస్తోంది. వారి సాలరీల్లో కూడా పెద్దగా మార్పులు ఉండవు.