బషీర్‌బాగ్, వెలుగు: మున్నూరుకాపు కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు ఇవ్వడంతోపాటు రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో సంఘ భవనాల నిర్మాణానికి రెండెకరాల చొప్పున భూమి కేటాయించాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం(పటేల్స్) వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ డిమాండ్ చేశారు. విద్యార్థుల వసతి గృహాల నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేయాలని, మున్నూరు కాపులకు 2 ఎమ్మెల్సీ పదవులు కేటాయించాలన్నారు.
బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్రవ్యాప్తంగా మున్నూరుకాపుల కుటుంబ సభ్యత్వ నమోదు కోసం రూపొందించిన వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. సంఘం గ్రేటర్ అధ్యక్షుడు ఆర్.వి.మహేందర్, రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
