అర్హులైన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు పథకాలు చేరాలి : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

అర్హులైన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు పథకాలు చేరాలి :  రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

వికారాబాద్, వెలుగు: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. వికారాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహ మెహ్రా తదితర అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 

ఎస్సీ, ఎస్టీల సమస్యలపై మానవతా దృక్పథంతో స్పందించాలని, బ్యాక్ లాగ్ పోస్టులు, కారుణ్య నియామకాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. పారిశుధ్య కార్మికులకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కల్పించాలని, సబ్ ప్లాన్ నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని చెప్పారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు తక్షణ ఆర్థికసాయం అందించి, విచారణ వేగవంతం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.