ముగిసిన పీజీఈసెట్ ఎగ్జామ్స్

ముగిసిన పీజీఈసెట్ ఎగ్జామ్స్
  • ముగిసిన పీజీఈసెట్ ఎగ్జామ్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మ్, ఎంఆర్క్, ఎంఈ,  గ్రాడ్యుయేట్ లెవ‌‌ల్ ఫార్మా డీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పీజీఈసెట్ గురువారం ముగిసింది. ఈ నెల 10న ప్రారంభమైన పీజీఈసెట్ పరీక్షలు నాలుగు రోజుల పాటు జరిగాయి. ప్రతిరోజు రెండు సెషన్లలో ఆన్​లైన్​లో పరీక్షలు నిర్వహించినట్టు పీజీఈసెట్ కన్వీనర్ అరుణ కుమారి తెలిపారు.

పీజీఈసెట్ కు మొత్తంగా 22,712 మంది దరఖాస్తు చేసుకోగా, 20,626 (90.82%) మంది పరీక్ష రాశారు. హైదరాబాద్ లో 18,300 మంది అభ్యర్థులకు 16,538 మంది, వ‌‌రంగ‌‌ల్‌‌లో 4,412 మందికి 4,088 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షలను కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, జేఎన్టీయూ రెక్టార్ ప్రొఫెసర్ విజయకుమార్ రెడ్డి, రిజిస్ట్రార్‌‌  వెంకటేశ్వర్ రావు తదితరులు పర్యవేక్షించినట్టు కన్వీనర్ చెప్పారు.