పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్, స్టాఫ్ నర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీలు: 02. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్–I (నాన్-మెడికల్) 01, ప్రాజెక్ట్ టెక్నికల్ స్టాఫ్–I 01.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లైఫ్ సైన్సెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పదో తరగతితో పాటు ఎంఎల్ టీ/ డీఎంఎల్టీలో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం మూడేళ్ల అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: లేదు.
చివరి తేదీ: మార్చి 10.
ఎంపిక విధానం: అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
స్టాఫ్ నర్స్ ఖాళీలు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి నర్సింగ్ లేదా మిడ్‌వైఫరీలో (జీఎన్ఎం) డిప్లొమా లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఏదైనా రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్డ్ నర్సుగా లేదా ఏఎన్ఎంగా నమోదై ఉండాలి.
వయోపరిమితి: గరిష్టంగా 30 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేదీ: మార్చి 02.
వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: మార్చి 03.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా.
డేటా ఎంట్రీ ఆపరేటర్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేదీ: మార్చి 07.
వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: మార్చి 09.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
మరిన్ని వివరాల కోసం pgimer.edu.in వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.
