దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 10 రూపాయలు, లీటర్ డీజిల్ పై 12 రూపాయల 50 పైసలు పెంచారని.. ఇదిగో ఆర్డర్ కాపీ అంటూ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగాయంటూ.. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆర్డర్ కాపీలపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.
పెట్రోల్ ,డీజిల్ ధరల పెంపుపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. పెట్రోలో,డీజిల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇటువంటి వార్తలను ఎల్లప్పుడూ అధికారిక ప్రభుత్వ వర్గాల ద్వారా మాత్రమే ధృవీకరించుకోండి. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఇతరులకు షేర్ చేయడం ఆపాలని పిఐబి ఫ్యాక్ట్ చెక్ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది.
ఇంధన ధరలలో ఎలాంటి సవరణ జరగలేదని అధికారులు ధృవీకరించారు. ప్రధాన నగరాల్లో ధరలు యథాతథంగా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 94.77, డీజిల్ ధర లీటరుకు రూ. 87.67గా ఉంది. ముంబైలో పెట్రోల్ లీటరుకు రూ. 103.54, డీజిల్ లీటరుకు రూ. 90.03 చొప్పున విక్రయిస్తున్నారు .
🚨FAKE NEWS!
— PIB Fact Check (@PIBFactCheck) April 29, 2026
An order circulating on social media claims to be issued by the Ministry of Petroleum and Natural Gas, stating that petrol and diesel prices have been increased by ₹10 and ₹12.50, respectively.#PIBFactCheck:
❌ This order is #FAKE .
✅ The Government of India… pic.twitter.com/tMmJa0Y4qA

