డయాబెటిస్ ఉన్నవాళ్లు తియ్యగా ఉండే పండ్లు, చక్కెర శాతాన్ని పెంచే కొన్నిరకాల ఫుడ్‌కి దూరంగా ఉంటారు. అయితే యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఎంజైమ్‌లు ఉండే పైనాపిల్ ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది అంటున్నాడు ఇంటర్నల్ మెడిసిన్, డయాబెటిక్ ఎక్స్పర్ట్ రాజీవ్ గుప్త.పైనాపిల్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ మిగతా పండ్లతో పోల్చితే తక్కువ. విటమిన్–సి ఉండే ఈ పండు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. చక్కెర శాతం పెరగకుండా చూస్తుంది ఇందులోని ఫైబర్. కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. బరువు తగ్గడంలో సాయపడుతుంది. అంతేకాదు జీర్ణసమస్యలు రాకుండా చూస్తుంది .
