రన్ వే పైన ముక్కలైన విమానం

రన్ వే పైన ముక్కలైన విమానం

టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో ఘోర ప్రమాదం జరిగింది. సబీహా గోక్సెన్ పోర్టులో విమానం రన్ వే పై జారి మంటలు రేపుతూ 60 కి.మీ దూసుకెళ్లింది. విమానం మూడు ముక్కలైంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 179 మంది గాయపడ్డారు. టర్కీస్ టెలివిజన్ టెలికాస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఇస్తాంబుల్ లో  క్యారియర్ పెగసాస్ ఎయిర్‌లైన్స్  బోయింగ్ 737 బుధవారం ఈజియన్ ఓడరేవు సిటీ ఇజ్మీర్ నుండి ఇస్తాంబుల్  కు వచ్చింది. సబీహా గోక్సెన్ ఎయిర్ పోర్టులో రన్ వేపై ల్యాండ్ అయ్యే సమయంలో జారిపడి కొద్ది దూరం దూసుకెళ్లింది. తర్వాత మంటలు చెలరేగాయి. విమానం మూడు ముక్కలు అయ్యింది. ముగ్గురు టర్కీవాసులు చనిపోగా 179 మందికి గాయాలయ్యాయి. విమానంలో 177 మంది ప్రయాణికులు,ఆరుగురు సిబ్బంది ఉన్నారు.  వీరిలో12 మంది చిన్నారులు  ఉన్నారు. కొందరిని రక్షించగా మరికొందరు ప్రయాణికులు అందులోనే చిక్కకుపోయారు. విమానం రన్వే నుండి జారిపడ్డ తర్వాత సుమారు 60 మీటర్లు (200 అడుగులు) దూసుకెళ్లిందని ఇస్తాంబుల్ గవర్నర్ అలీ యెర్లికాయ చెప్పారు.