మన ఒంట్లోనూ ప్లాస్టిక్

మన ఒంట్లోనూ ప్లాస్టిక్

మనం సంవత్సర కాలంలో శరీరంలోకి కేవలం నీళ్ల ద్వారా 250 గ్రాముల ప్లాస్టిక్​ తీసుకుంటున్న విషయం తెలుసా! అవును ఆస్ట్రేలియాలోని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అనాలసిస్, ది యూనివర్సిటీ ఆఫ్​ న్యూకాజిల్, ఎన్విరాన్​మెంటల్ జర్నల్ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ నిజం బయటపడింది. వారానికి 5, నెలకు 21, ఇలా సంవత్సరానికి 250 గ్రాముల ప్లాస్టిక్ బాడీలోకి చేరుతోందని తేలింది. ప్లాస్టిక్ ​భూమిలో కరగకపోవడంతో భూగర్భ జలాలు విషపూరితమవుతున్నాయి. మనం తీసుకునే చేపలు, ఇతర జంతువుల మాంసాల రూపంలోనూ ప్లాస్టిక్ కారకాలు చేరుతున్నాయి. హాట్​హాట్​సూప్​లు వంటివి ప్లాస్టిక్ కంటైనర్లలో నింపడంతో విషపూరిత ఆమ్లాలు ఉత్పత్తవుతున్నాయి. ఫలితంగా కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ ప్లేట్లలో తింటే కిడ్నీ ప్రాబ్లమ్స్​ వస్తున్నట్లు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ ను కాల్చినప్పుడు వచ్చే హానికర వాయువులతో భయంకరమైన శ్వాసకోస వ్యాధులు వచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

ప్రతిరోజు మనం వాడి పడేస్తున్న ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసేందుకు ఏండ్లు పడుతోంది. ఇలా ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి విడుదలవుతున్న కెమికల్స్ తో పాటు ప్లాస్టిక్ పదార్థాలు భూగర్భ జలంలో కలుస్తున్నాయి. పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ తుక్కుతో విషపూరితమవుతున్నాయి. ఇలా తాగేనీరు ద్వారా కనిపించకుండానే ప్లాస్టిక్​ మన పొట్టలోకి చేరుతోంది. ప్లాస్టిక్ ​చేరిన నీటిలో పెరిగిన చేపలను తినడం, ఆ నీరు తాగిన జంతువుల నుంచి కూడా మనకు ప్లాస్టిక్​ఎఫెక్ట్​ఉంటోదని పరిశోధనలో వెల్లడైంది.

లంచ్​ బాక్స్ ​రూపంలో కొంత..

ప్లాస్టిక్ వ్యర్థాలు శరీరంలోకి చేరడం వల్ల క్యాన్సర్, వివిధ అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. స్కూళ్లకు వెళ్లే పిల్లలకు ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ బాక్సుల్లో ఆహారాన్ని పెట్టి ఇవ్వడంతో చిన్న వయసులోనే వారు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. టీ తాగేందుకు ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ కప్పులు వాడకం, ప్లాస్టిక్ డబ్బాల్లో వేడి వేడి అన్నాన్ని నింపి తినడంతో కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని సర్వేలో తేలింది. హాట్ సూప్‌‌‌‌‌‌‌‌లు వంటివి ప్లాస్టిక్ కంటైనర్లలో నింపడంతో విషపూరిత ఆమ్లాలు ఉత్పత్తవుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ప్లాస్టిక్ ప్లేట్లలో ఆహారం తీసుకునే వారిలో కిడ్నీ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్లాస్టిక్ ను కాల్చినప్పుడు వచ్చే హానికర వాయువులతో భయంకరమైన శ్వాసకోస వ్యాధులు వస్తున్నట్లు చెబుతున్నారు.

ఇంకా దొరుకుతున్నయ్​

ప్రస్తుతం గ్రేటర్ జనాభా కోటి పైనే ఉంటుంది. రోజూ ఉత్పత్తి అవుతున్న చెత్త 4,300 మెట్రిక్‌‌‌‌‌‌‌‌ టన్నులు. ఇందులో 20 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే. అంటే 860 టన్నుల వరకు ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ వ్యర్థాలన్న మాట. షాపింగ్‌‌‌‌‌‌‌‌ మాల్స్‌‌‌‌‌‌‌‌ మొదలు చిన్నచిన్న  దుకాణాలలోనూ ఇంకా నిషేధిత ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ కవర్లు కనిపిస్తున్నాయి. ఇంకా విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. మూడేళ్ల క్రితం ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ నిషేధం అమల్లోకి వచ్చినా వాడకాన్ని అధికారులు కట్టడి చేయలేకపోతున్నారు. ప్రత్యామ్నాయంగా జ్యూట్‌‌‌‌‌‌‌‌ బ్యాగుల తయారీ, ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ రోడ్ల నిర్మాణాలు వంటి ప్రయోగాత్మక నిర్ణయాలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.

ప్లాస్టిక్​ రోడ్లతో కొంత పరిష్కారం

దేశంలోని పలు కార్పొరేషన్లు ప్లాస్టిక్​ని రీసైకిల్​చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఉత్పత్తవుతున్న వందల టన్నుల ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ వ్యర్థాల కోసం ప్లాంట్లను నిర్మిస్తున్నాయి.

అక్కడ వ్యర్థాలను కరిగించి వాటర్‌‌‌‌‌‌‌‌, డ్రైనేజీ, ట్యాంకుల తయారీకి ఉపయోగపడేలా ముడి సరుకు తయారు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఖర్చులో ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ రోడ్లు వేసేందుకు ప్లాన్​చేస్తున్నారు. తారుతో కలిసిపోయే ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ను రోడ్ల నిర్మాణానికి వాడుతున్నారు. పూర్తిగా తారుతో వేసిన రోడ్ల కంటే ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌తో కలిపిన తారు రోడ్లు10 సంవత్సరాలకు పైగా నాణ్యతగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఈ ప్లాన్​ను ఇంప్లిమెంట్​చేస్తున్నారు.