న్యూఢిల్లీ, వెలుగు: ‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’పథకం తెలంగాణలో అమలు కావడం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం లోక్‌సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రిఠాకూర్ రాతపూర్వక సమాధానమిచ్చారు.
గర్భిణులు, బాలింతల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి మాతృ వందన యోజన స్కీమ్‌ను కేంద్రం అమలు చేస్తోందని చెప్పారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను చేపట్టకపోవడంతో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా రిలీజ్ కాలేదని తెలిపారు. ఈ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4.24 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరిందని వివరించారు.

