ప్రధాని మోదీకి సీషెల్స్ దేశ అత్యున్నత పురస్కారం గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ ప్రదానం చేశారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మిని ఈ అవార్డును అందజేశారు. విదేశీ దేశాల నుంచి మోదీ అందుకున్న 34వ అంతర్జాతీయ గౌరవం ఇది.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటున్న అన్ని దేశాలకు ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు. భారత్–సీషెల్స్ మధ్య 50 ఏళ్ల దౌత్య సంబంధాలు రెండు దేశాల స్నేహానికి నిదర్శనమని అన్నారు.
సీషెల్స్ కోస్ట్ గార్డ్‌కు భారత్‌లో తయారైన ఫాస్ట్ పెట్రోల్ నౌకను కూడా మోదీ అందజేశారు. అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినితో ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ అంశాలపై చర్చలు జరిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
