Khelo India Youth Games:ఎంత ఆడితే..అంత షైన్ అవుతారు:ప్రధాని మోదీ

 Khelo India Youth Games:ఎంత ఆడితే..అంత షైన్ అవుతారు:ప్రధాని మోదీ

భారతదేశం బలమైన క్రీడా సంస్కృతిని అభివృద్ది చేస్తోందన్నారు ప్రధాని మోదీ. క్రీడా సంస్కృతి ఎంత వ్యాపిస్తే భారత దేశ శక్తి అంత పెరుగుతుందన్నారు. దేశంలో క్రీడలకు పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రశంసించారు. క్రీడాకారులు ఎంత ఎక్కువగా ఆడితే అంత రాణిస్తారని ప్రధాని మోదీ అన్నారు. 

ఆదివారం(మే4) బీహార్లోని పాట్నాలో 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్2025 క్రీడోత్సవాలను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మోదీ.. దేశం క్రమంగా బలమైన క్రీడా సంస్కృతిని అభివృద్ధి చేస్తుందన్నారు. 

బీహార్ క్రీడా ప్రతిభను ప్రస్తావిస్తూ యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఆటతీరును హైలైట్ చేశారు. వైభవ్ విజయం వెనక అంకిత భావం ఉందన్నారు. క్రీడాకారులు ఎంత ఎక్కువ ఆడితే అంత రాణిస్తారని ప్రధాని మోదీ అన్నారు.