
ప్రధాని మోడీ బంగ్లాదేశ్‌లో ఇవాళ రెండో రోజు పర్యటిస్తున్నారు. చారిత్రక హిందూ దేవాలయాలను ఆయన సందర్శించి… ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ వెళ్లిన మోడీ అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం ఆయన సత్కిరా జిల్లా ఈశ్వరీపూర్ లోని జెషోరేశ్వరి కాళీ ఆలయాన్ని సందర్శించారు. ఆలయాధికారులు మోడీకి సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు.
అమ్మవారి ఆలయంలో కలయ తిరిగిన మోడీ. ఆ తర్వాత నేలపై కూర్చుని ప్రత్యేక పూజలు చేశారు. చేతితో తయారు చేసిన ప్రత్యేక బంగారు కిరీటాన్ని అమ్మవారికి అలంకరించారు. ఆలయం లోపలకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించిన ప్రధాని.. ప్రార్థనలు చేశారు. త్వరగా కరోనా వైరస్ అంతం కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
భారత్, సరిహద్దు దేశాల్లో ఉన్న 51 శక్తి పీఠాల్లో జెశోరేశ్వరీ కాళీ ఆలయం ఒకటి.