ప్రధాని మోడీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదివారం ( మే 10 ) బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. ఈ క్రమంలో పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. బేగంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా హెచ్ఐసీసీ చేరుకోనున్నారు మోడీ.
ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో రూ.9 వేల 377 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ పనులు చేపట్టనున్నారు మోడీ. పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే తనిఖీలు చేపట్టారు ఎస్ఓటీ టీం. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ సీసి టీవీ నిఘా ఏర్పాటు చేసి.. స్నేఫర్ డాగ్స్, అక్టోపస్ బృందాలు మోహరించారు. బేగంపేట్, బోయినపల్లి, మారేడు పల్లి ప్రాంతాల్లో డ్రోన్లు, uav కెమెరా బ్యాగ్ బ్యానర్ల నిషేధం విధించారు పోలీసులు.
►ALSO READ | కరీంనగర్ బంద్ పాక్షికం..యథావిథిగా దుకాణాలు, పెట్రోల్ బంకులు
పరేడ్ గ్రౌండ్ చుట్టూ 12 ప్రాంతాల్లో వాహన పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పరేడ్ గ్రౌండ్స్ పక్కనే ఉన్న మెట్రో స్టేషన్స్, ఫ్లై ఓవర్ బ్రిడ్జి లన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి భద్రత బలగాలు.
