
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ. దేశంలో మహిళలు వివిధ రంగాలలో కొత్త రికార్డులు, గొప్ప విజయాలు సాధిస్తున్నారన్నారు రాష్ట్రపతి. మహిళలు, పురుషుల మధ్య అసమానతలు తొలగించేందుకు కృషి చేయాలన్నారు. మహిళలు సాధించిన విజయాలతో దేశం గర్విస్తుందన్నారు ప్రధాని మోడీ. అన్ని రంగాలలో మహిళ సాధికారతను పెంచేందుకు అవకాశం దొరకడం తమ ప్రభుత్వానికి దక్కిన గౌరవం అన్నారు. నారీ శక్తికి సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు.