కొత్త ఆలోచనలతో ముందుకెళుతున్నం

కొత్త ఆలోచనలతో ముందుకెళుతున్నం
  • ‘అమృత్ మహోత్సవ్’ ప్రోగ్రామ్‌‌లో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ‘‘కొత్త ఆలోచనలతో ముందుకెళుతూ, అభివృద్ధికి తొవ్వ చూపే నిర్ణయాలతో దేశాన్ని నడిపిస్తున్నం.. సిటిజన్లపై ఎలాంటి తేడా చూపని వ్యవస్థను తయారుచేస్తున్నాం” అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గురువారం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కీ ఓర్’ అనే కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరి అభివృద్ధికి అనుగుణంగా దేశ అభివృద్ధి ఉంటుందని, దేశం ముందుకు వెళ్లేందుకు ప్రతి ఒక్కరి డ్యూటీలకు మరింత ఇంపార్టెన్స్ ఇవ్వాలని సూచించారు. ‘‘75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఒక రకమైన అనారోగ్యం మన సమాజాన్ని, మన దేశాన్ని, మనందరినీ పీడించింది. మనం మన డ్యూటీ నుంచి తప్పుకోవడం, వాటికి ప్రాధాన్యం ఇవ్వకపోవడమే.. ఆ అనారోగ్యం’’ అని కామెంట్ చేశారు. 

పుకార్లను తిప్పికొట్టాలి
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌‌లో భాగంగా బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ఏడాదంతా నిర్వహించనున్న 30 క్యాంపెయిన్లు, 15 వేల ప్రోగ్రామ్స్, ఈవెంట్స్‌‌ను ప్రధాని ప్రారంభించారు. అంతర్జాతీయంగా ఉన్న బ్రహ్మ కుమారీస్ లాంటి సంస్థలు.. భారతదేశానికి వ్యతిరేకంగా విదేశాల్లో జరుగుతున్న ప్రచారాన్ని, పుకార్లను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ‘‘ఇండియా ఇమేజ్‌‌ను చెడగొట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను మీరు చూస్తూనే ఉన్నారు. దీనిపై అంతర్జాతీయంగా చాలానే జరుగుతోంది. ‘అదంతా రాజకీయం’ అని చెప్పి మనం చేతులు కడుక్కోలేం. ఇది రాజకీయం గురించి కాదు.. మన దేశానికి సంబంధించిన విషయం” అని 
ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.