యూపీ BJP ఉపాధ్యక్షుడిగా ప్రధాని సన్నిహితుడు ఎకెశర్మ

యూపీ BJP ఉపాధ్యక్షుడిగా ప్రధాని సన్నిహితుడు ఎకెశర్మ

ఉత్తర ప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడు, మాజీ  IAS అధికారి ఎకె. శర్మను యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమించింది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. త్వరలో UPలో జరగనున్న కేబినెట్‌ విస్తరణలో ఎకె.శర్మను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. అయితే అందుకు విరుద్ధంగా ఆయనకు కీలకమైన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టారు. IAS  ఉన్న సమయంలో ఆయన 18 నెలల పాటు మోడీ టీంలో అత్యంత కీలక వ్యక్తిగా వ్యవహరించారు. కరోనా వ్యాప్తి నివారణ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసికి పంపారు.

 శర్మ స్వస్థలం తూర్పు యూపీలోని మవా జిల్లా.UPలో మారిన పరిస్థితుల  క్రమంలో ఎకె. శర్మను వినియోగించుకోవాలని  బీజేపీ భావిస్తోంది. రాష్ట్రంలో నాయకత్వ మార్పు లేదని ఇటీవల బీజేపీ స్పష్టం చేసింది.