
ప్రధాని మోడీ మాతృమూర్తి హీరాబెన్ కరోనా వ్యాక్సిన్ మొదటి డోసును తీసుకున్నారు.ఈ విషయాన్ని మోడీ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. 99 ఏళ్ల తన తల్లి ఇవాళ( గురువారం)కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని చెప్పారు. అంతేకాదు మీ చుట్టూ ఉన్న వారిని కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోరారు. అయితే ఆమె ఏ వ్యాక్సిన్ తీసుకున్నది మోడీ ట్విట్టర్ లో ట్వీట్ చేయలేదు.
మార్చి 1 నుండి దేశవ్యాప్తంగా రెండోదశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్, ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెన్ కొవిషీల్డ్ వ్యాక్సిన్‌లను ప్రస్తుతం భారత్‌లో వినియోగిస్తున్నారు.