మన్మోహన్‌ సింగ్‌కు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

మన్మోహన్‌ సింగ్‌కు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

మాజీ ప్రధాని  డాక్టర్ మన్మోహన్ సింగ్‌ 91వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ,  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆయనకు ట్విట్టర్  ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.  " డాక్టర్ మన్మోహన్ సింగ్ జీకి జన్మదిన శుభాకాంక్షలు..  భగవంతుుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని నేను  ప్రార్థిస్తున్నాను "   అని మోదీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

మరోవైపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా డాక్టర్ సింగ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. " మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ .. మీ చిత్తశుద్ధి, దేశ నిర్మాణం,  బహుజనుల ఆర్థిక అభ్యున్నతి పట్ల అచంచలమైన నిబద్ధత నాకు ఎల్లప్పుడూ ప్రేరణగా ఉంటుంది.. పుట్టినరోజు సందర్భంగా మీకు  మంచి ఆరోగ్యం,  సంతోషం కలగాలని కోరుకుంటున్నాను " అని ట్వీట్ చేశారు.  

మన్మోహన్‌ సింగ్‌కి 91 ఏళ్లు  

పంజాబ్‌లోని గాహ్ గ్రామంలో 1932 సెప్టెంబర్ 26న మన్మోహన్‌ సింగ్ జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్నారు. వరుసగా రెండు పర్యాయాలు (2004 నుంచి  -2014 వరకు) ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన ఈ రోజు 91వ ఏట అడుగుపెట్టారు.  ప్రస్తుతం మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 

ALSO READ : ఎలుకలపై ఎంత ప్రేమ : ఎలక బోన్లు.. జిగురు మందుల అమ్మకాలు నిషేధం