- మంత్రి కోమటిరెడ్డికి పీఎంటీఏ నేతల వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మోడల్ స్కూల్ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పీఎంటీఏ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం హైదరాబాద్‌లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని ఆ సంఘం ప్రతినిధులతో పాటు కలిసి వినతిపత్రం అందించారు. మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి సానుకూల నిర్ణయం వచ్చేలా చూడాలని మంత్రిని కోరారు. వీటిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
