V6 News

కరోనా బారిన పడిన స్పీకర్ పోచారం

కరోనా బారిన పడిన స్పీకర్ పోచారం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. నేతలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా.. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా సోకింది. మంగళవారం జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. అందులో పాజిటివ్ గా రిజల్ట్ వచ్చింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు. గత కొన్ని రోజులు నుంచి తనను కలిసిన వారు.. సన్నిహితంగా ఉన్న వారందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకవేళ ఏమైనా లక్షణాలు ఉంటే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని స్పీకర్ పోచారం సూచించారు. స్పీకర్‌కు కరోనా సోకడం ఇది మూడోసారి.

మరోవైపు... తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 406 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఒక్కరోజులో 494 మంది ఆరోగ్యవంతులయ్యారని.. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 8, 22, 667 మంది కోలుకున్నారని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా నుంచి ఎవరూ చనిపోలేదని, మరణాల సంఖ్య 4 వేల 111గా ఉందని తెలిపింది. రికవరీ రేటు 99.13 శాతంగా ఉందని, మొత్తం 27 వేల 348 టెస్టులు నిర్వహించడం జరిగిందని పేర్కొంది.