రాధా కిషన్ రావును 10 రోజుల కస్టడీకి ఇవ్వండి: పోలీసులు

రాధా కిషన్ రావును 10 రోజుల కస్టడీకి ఇవ్వండి: పోలీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టును అశ్రయించారు పోలీసులు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావును కస్టడీకి కోరుతూ.. పిటిషన్ దాఖలు చేశారు. గత శుక్రవారం(మార్చి 29) రాధ కిషన్ రావుని అరెస్ట్ చేసిన పోలీసులు.. 10 రోజులు కస్టడీ కోరారు. పోలీసుల కస్టడీ పిటిషన్ పై రాధా కిషన్ రావుకు వ్యక్తి గతంగా నోటీసులు జారీ చేసింది నాంపల్లి కోర్టు. కౌంటర్ దాఖలు చేస్తామని రాధాకిషన్ రావు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పోలీస్ కస్టడీ పిటిషన్ పై 2024 ఏప్రిల్ 1 సోమవారం మధ్యాహ్నం నాంపల్లి కోర్టు విచారించనుంది.

2023 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ వెహికిల్స్ లో హైదరాబాద్ నుంచి జిల్లాలకు డబ్బులు పంపినట్లు గుర్తించారు పోలీసులు. కొంతమంది వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేయాలని ప్రణీత్ రావుకు అదేశాలిచ్చినట్లు నిర్దారణకు వచ్చారుపోలీసులు. మరోవైపు తమను అక్రమంగా బెదిరించి డబ్బులు లాక్కున్నాడని రాధా కిషన్ రావు బాధితులు పోలీసుల ముందుకు వస్తున్నారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ తో పాటు.. అక్రమ డబ్బు రవాణాపై మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు పోలీసులు.