గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలో ఈ నెల 9న బీఆర్ఎస్ లీడర్ పూదరి సత్యనారాయణగౌడ్ అరెస్ట్ సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు(మంథని), కోరుకంటి చందర్(రామగుండం), మంథని మున్సిపల్ మాజీ చైర్మన్ పుట్ట శైలజ, ఇతర లీడర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రజాశాంతికి భంగం కలిగించడం, నిర్బంధించడం, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకపరచడంపై కానిస్టేబుల్వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.
