క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై పోలీస్ పంజా.. రూ.. 2 కోట్ల 41 లక్షలు సీజ్

క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై పోలీస్ పంజా.. రూ.. 2 కోట్ల 41 లక్షలు సీజ్

ఆన్ లైన్ బెట్టింగ్ స్థావరాలపై  భారీ ఆపరేషన్  చేపట్టారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. శంషాబాద్, బాలానగర్, మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా చేసిన ఈ ఆపరేషన్ లో భారీగా నగదు, అధునాతన పరికరాలు గుర్తించి సీజ్ చేశారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారం రావడంతో రైడ్ చేయగా ఘటనా స్థలంలో 15 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద రూ. 2 కోట్ల 41 లక్షల నగదును గుర్తించి సీజ్ చేశారు. 

బెట్టింగ్ డబ్బులు మొత్తం 57 బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ అవుతున్నట్టుగా గుర్తించారు. అకౌంట్లలో రూ.  2 కోట్లు ఉన్నట్లు గుర్తించి డబ్బు విత్ డ్రా కానివ్వకుండా ఖాతాలను ఫ్రీజ్ చేయించారు. మొత్తం రూ. 3.29 కోట్ల రూపాయల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఏ1గా నరసరావుపేటకు చెందిన రామాంజనేయులని చెప్పారు. బెట్టింగ్ నిర్వహణ కోసం అధునాతన పరికరాలు ఉపయోగించినట్టు గుర్తించామని తెలిపారు. 

Vajraexch.com, threeech.com, londonexch.com, ద్వారా నెల రోజుల్లో  రూ.1.50 కోట్లు పెట్టుబడి పెట్టారని విచారణలో తెలిసిందని పోలీసులు తెలిపారు.  ఈ మొత్తం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని  చెప్పారు. వారి వెనక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.  

also read : మూడో ప్రపంచయుద్ధం మొదలైందా..?: జ్యోతిష్యురాలు బాబా వంగా ఏం చెప్పారు..