మూడో ప్రపంచయుద్ధం మొదలైందా..?: జ్యోతిష్యురాలు బాబా వంగా ఏం చెప్పారు..

మూడో ప్రపంచయుద్ధం మొదలైందా..?: జ్యోతిష్యురాలు బాబా వంగా ఏం చెప్పారు..

ప్రఖ్యాత జ్యోతిష్యురాలు బాబా వంగా..రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలు, ప్రపంచాన్ని ప్రభావితం చేసే వినాశకరసంఘటనలు జరుగుతాయని ముందే చెప్పింది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న పరిణామాలు, మూడో ప్రపంచ యుద్ధం కూడా జరగొచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం ఇజ్రాయెల్, గాజా, ఇరాన్ మధ్య నెలకొన్న వినాశకర పరిస్థితుల గురించి  బాబా వంగా ఏం చెప్పిందో చూద్దాం. 

2024 లో బాబా వంగా అంచనాలు 

2024 లో బాబా వంగా అంచనాల్లో మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం, ఐరోపాలో పెరుగుతున్న తీవ్రవాద కార్యకలాపాలు,ఆర్థిక సంక్షోభం, వాతావరణంలో భయంకరమైన మార్పులు, సైబర్ దాడులు, మూడో ప్రపంచ యుద్ధం హెచ్చరికలు ఉన్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్, హమాస్  మధ్య వివాదం అణుదాడులకు, భారీ విధ్వంసానికి దారి తీయవచ్చని.. వీటిని నివారించేందుకు దౌత్య ప్రయత్నాల అవసరాన్ని బాబా వంగా 30 సంవత్సరాల క్రితమే చెప్పటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అప్పట్లో బాబా వంగా చెప్పిన విషయాలు.. ఇప్పుడు నిజం అవుతున్నాయని సోషల్ మీడియా వేదికగా పలువురు ఆ విషయాలను ప్రస్తావిస్తున్నారు. 

మిడిల్ ఈస్ట్ టెన్షన్స్.. వరల్డ్ వార్ 3 స్పెక్యులేషన్

ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఇరాన్ దూకుడు చర్యలతో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్లు, క్షిపణులు, రాకెట్లను మోహరించడంతో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని భయాలను రేకెత్తించింది. సోషల్ మీడియాలో 3వ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి. సిరియాలోని డమాస్కస్ లోని ఇరాన్ కాన్సులేట్ పై ఏప్రిల్ 1న జరిగిన వైమానిక దాడికి ప్రతిస్పందనగా.. ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులకు పాల్పడుతుంది. ఇజ్రాయెల్ టార్గెట్ గా ఇప్పటికే వందల క్షిపణులను ప్రయోగించింది ఇరాన్. లెబనాన్ సరిహద్దుల నుంచి ఇజ్రాయెల్ వైపు దాడులకు దిగుతున్నది ఇరాన్.