తాండూరు, వెలుగు: సంకెళ్లతో పోలీస్‌స్టేషన్‌నుంచి నిందితుడు పరారైన కేసులో వికారాబాద్ జిల్లా తాండూరు టౌన్పీఎస్కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు పడింది. ఢిల్లీకి చెందిన అజీమ్ పట్టణంలోని రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఓ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన బాలికను ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు.
మే 9న బాలికను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు యత్నించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని కిడ్నాప్కేసు పెట్టారు. అయితే, ఒకే చేతికి సంకెళ్లు వేసిన పోలీసులు లాకప్రూమ్ముందు ఉన్న హాల్లో ఉంచారు. అప్పుడు స్టేషన్లో మహిళ ఎస్ఐ, విమెన్కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్ నరేందర్ ఉన్నారు. అయితే, అప్పుడే వేరే ఫిర్యాదు రాగా దానికి సంబంధించి ఇరు వర్గాలతో మాట్లాడుతున్నారు. ఇదే సమయమని అనుకున్న అజీమ్వెనక తలుపు నుంచి బొందలగడ్డవైపు పరారయ్యాడు. కొద్దిసేపటికి నిందితుడు లేడని తెలుసుకున్న పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. నిందితుడు పారిపోయాడని బయటకు పొక్కడంతో తామే బెయిల్ఇచ్చి పంపించివేశామని మ్యానేజ్చేశారు. ఆధార్‌కార్డుపై అడ్రస్ఆధారంగా ఢిల్లీకి వెళ్లి అజీమ్‌ను పట్టుకువచ్చారు.
బాలికను పిలిపించి ఆమె ఫిర్యాదు ఆధాంరగా పోక్సో కేసు పెట్టి రిమాండుకు తరలించారు. కాగా, నిందితుడి పరారైన ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు హెడ్కానిస్టేబుల్నరేందర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించి సస్పెండ్‌చేశారు. విచారణ తర్వాత మిగిలిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
