ఎస్ఐ అభ్యర్థుల సమస్యలు పరిష్కరిస్తాం

ఎస్ఐ అభ్యర్థుల సమస్యలు పరిష్కరిస్తాం
  • ఆన్​లైన్​లో అభ్యర్థుల ఓఎంఆర్ ​షీట్లు
  • రేపటితో ముగియనున్న అభ్యంతరాల గడువు
  • 52 ప్రశ్నలకు కరెక్ట్‌‌‌‌ ఆన్సర్‌‌‌‌‌‌‌‌ చేసిన వారు క్వాలిఫై
  • అర్హులైన అభ్యర్థులకు ఫేజ్‌‌‌‌-2లో ఎంట్రీ 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఎస్‌‌‌‌ఐ ప్రిలిమినరీ పరీక్షల ఫైనల్‌‌‌‌ కీ రిలీజ్‌‌‌‌ చేసేందుకు పోలీస్ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డ్‌‌‌‌ ఏర్పాట్లు చేస్తోంది. వారం రోజుల్లో  ఫైనల్‌‌‌‌ కీతో పాటు అభ్యర్థుల ఓఎమ్‌‌‌‌ఆర్‌‌‌‌ షీట్లను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేస్తామని బోర్డు చైర్మన్ వివి శ్రీనివాస్‌‌‌‌ రావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 554 ఎస్‌‌‌‌ఐ పోస్టులకు ఈనెల 7న ప్రిలిమినరీ ఎగ్జామ్‌‌‌‌ నిర్వహించారు. ఈ పరీక్షల్లో క్వశ్చన్‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌లోని ఎనిమిది తప్పులను గుర్తించామని శ్రీనివాస్​రావు వెల్లడించారు. ఇంగ్లిష్‌‌‌‌, తెలుగు, హిందీలో క్వశ్చన్‌‌‌‌ పేపర్స్‌‌‌‌ రూపొందించే క్రమంలో కొన్ని సమస్యలు తలెత్తడం సాధారణమే అని ఆయన అన్నారు. శుక్రవారం విడుదల చేసిన ఫస్ట్‌‌‌‌ కీతో పాటు డిలీట్‌‌‌‌ చేసిన ప్రశ్నల నంబర్లను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో పెట్టామని, ఆయా ప్రశ్నలను ‘డి’  అక్షరంతో సూచించామని తెలిపారు.

‘‘క్వశ్చన్‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌లో తలెత్తిన తప్పుల కారణంగా200 ప్రశ్నల్లో192 ప్రశ్నలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటాం. ఇందులో 52 ప్రశ్నలకు కరెక్ట్‌‌‌‌ ఆన్సర్ చేసిన అభ్యర్థులు క్వాలిఫై అవుతారు. ఇలాంటి సమస్యలపై ఈనెల 15 వరకు అభ్యంతరాలు తీసుకుంటాం. వీటిని నిపుణుల కమిటీ పరిశీలించి, అభ్యర్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అందిస్తాం. ఇందు కోసం కనీసం మూడు రోజుల టైమ్​ అవసరం” అని చైర్మన్ శ్రీనివాస్‌‌‌‌ రావు తెలిపారు. ఎలాంటి లీగల్‌‌‌‌ సమస్యలు తలెత్తకుండా అభ్యర్థుల సమస్యలు పరిష్కారిస్తామని ఆయన చెప్పారు. అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి ఫేజ్‌‌‌‌ 2 ఎంట్రీకి అప్లికేషన్లు స్వీకరిస్తామని, తరువాత ఫిజికల్‌‌‌‌ టెస్ట్‌‌‌‌కు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు.