అస్సాంలో రూ.48 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

అస్సాంలో రూ.48 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

అస్సాంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. శివసాగర్, కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో రెండు వేర్వేరు ఆపరేషన్లలో రూ.48 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఆపరేషన్లలో ముగ్గురు డ్రగ్స్ వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు.

శివసాగర్ జిల్లాలో పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో దాదాపు రూ.37 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. జూన్ 16వ తేదీ అర్థరాత్రి సమయంలో పక్కా సమాచారంతో నాగాలాండ్ నుండి వచ్చిన ట్రక్కును పోలీసులు తనిఖీ చేశారు.

 ట్రక్కులో 4.6 కిలోల బరువున్న హెరాయిన్‌తో కూడిన 399 సబ్బు కేసులను గుర్తించి సీజ్ చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోనూ డ్రగ్స్ తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అందుపులోకి తీసుకున్నారు.  నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.