ఈసీ నిర్లక్ష్యం వల్లే పోలింగ్ శాతం తగ్గింది

ఈసీ నిర్లక్ష్యం వల్లే పోలింగ్ శాతం తగ్గింది

ఎలక్షన్ కమిషన్ నిర్లక్ష్యం కారణంగానే GHMC ఎన్నిలకల్లో పోలింగ్ శాతం తగ్గిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన… ఓటర్లను భయపెట్టేందుకు కేసీఆర్,కేటీఆర్ ప్రయత్నం చేశారన్నారు.ఎన్నికల సమయంలో బీజేపీ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, వారిపై దాడులకు తెగబడ్డారన్నారు. అయినప్పటికీ బీజేపీ కార్యకర్తలు భయపడకుండా TRS అన్యాయాలను అడ్డుకున్నారని చెప్పారు. అంతేకాదు ఎక్కడా గొడవలకు కూడా దిగలేదన్నారు. ఎన్నికల సంఘం సీఎం కేసీఆర్ చెప్పినట్లు నడుచుకుందన్నారు.

కావాలనే టీచర్లకు సీఎం కేసీఆర్ ఎలక్షన్ డ్యూటీ వేయలేదని.. వారి మీద ఆయనకు నమ్మకం లేదన్నారు బండి సంజయ్. అనుభవం లేని వ్యక్తులతో డ్యూటీ చేయించారన్నారు. అంతేకాదు… వరుసగా నాలుగు రోజులు సెలవు వచ్చేలా ముందే ప్లాన్ చేసి ఎన్నికలు పెట్టారన్నారు. సర్వేలన్నీ బీజేపీ అనుకూలంగా వచ్చాయని, ఓటమి భయంతోనే KCR కుటిల రాజకీయాలు చేశారని విమర్శించారు. ఎక్కడా లేని విధంగా ఈసారి మంత్రులే బరితెగించి డబ్బులు పంచారని.. చూసి చూడనట్టు వ్యవహరించిన రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు బీజేపీని ఆదరించారని….పూర్తి మెజార్టీతో గ్రేటర్ ను కైవసం చేసుకుంటామని తేల్చిచెప్పారు బండి సంజయ్.