పౌల్ట్రీ ఫామ్ లతో పెరుగుతున్న కాలుష్యం

పౌల్ట్రీ ఫామ్ లతో పెరుగుతున్న కాలుష్యం

గైడ్​లైన్స్​ మార్చాలని సీపీసీబీకి ఆదేశం

పౌల్ట్రీఫామ్స్​ ఎన్విరాన్​మెంట్​ ప్రొటెక్షన్​ రూల్స్​కు కట్టుబడాలన్న ఎన్జీటీ

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్

పౌల్ట్రీతో పర్యావరణానికి నష్టం లేదంటున్న ఇండస్ట్రీ

ఈ తీర్పుతో చిన్న వ్యాపారాలకు నష్టమని ఆందోళన

న్యూఢిల్లీ:పౌల్ట్రీఫామ్‌‌‌‌ల వల్ల కాలుష్యం పెరుగుతోందని, సమీప ప్రాంతాల వారికి వ్యాధులు వస్తున్నాయని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పేర్కొంది. గ్రీన్ కేటగిరీ ఇండస్ట్రీగా వర్గీకరిస్తూ.. పౌల్ట్రీ ఫామ్‌‌‌‌లకు పలు చట్టాల కింద ఇచ్చిన రెగ్యులేషన్‌‌‌‌ మినహాయింపులను, గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ను సమీక్షించాలని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ)ని ఆదేశించింది. మూడు నెలల్లోగా కొత్త ఆర్డర్లను సీపీసీబీ జారీ చేయాలని స్పష్టం చేసింది. ఎలాంటి ఆర్డర్లు జారీ చేయకపోతే.. గాలి, నీరు, పర్యావరణ సంరక్షణ చట్టాల కింద అన్ని రాష్ట్ర  ప్రభుత్వాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డులే కన్సెంట్ మెకానిజాన్ని అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.  ఫౌల్ట్రీ ఫామ్‌‌‌‌ల వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని, వీటిని రెగ్యులేట్ చేయాల్సినవసరం ఉందని ఎన్‌‌‌‌జీటీ పేర్కొంది.

నివేదిక ఏం చెప్పిందంటే…

నేషనల్ ఎన్విరాన్‌‌‌‌మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ సమర్పించిన రిపోర్ట్ ప్రకారం, పౌల్ట్రీఫామ్స్‌‌‌‌తో పర్యావరణానికి నష్టం కలుగుతోంది. కోళ్లఫామ్‌‌‌‌ల వల్ల ఈగలు, ఎలుకలు, కుక్కలు ఎక్కువ అవుతున్నాయి. వీటికి రోగాలు వచ్చి.. స్థానికులకు పలు వ్యాధులు, సమస్యలు వస్తున్నాయి.  పౌల్ట్రీఫామ్స్​లో మురుగునీటిపారుదల వ్యవస్థ బాగా లేకున్నా అక్కడి పరిసరాలకు హాని కలుగుతుంది. చనిపోయిన కోళ్ల, కోళ్ల ఈకలు కుళ్లిపోవడంతో చెడు వాసన వస్తుంది.అంతేగాక వీటి వల్ల ప్రమాదకర వాయువులు గాలిలో కలుస్తున్నాయి. కమర్షియల్ పౌల్ట్రీలకు  ప్రొవిజన్స్ ఆఫ్ వాటర్(ప్రివెన్షన్అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్)  యాక్ట్ నుంచి మినహాయింపు ఇస్తూ ఇచ్చిన సీపీసీబీ 2015 గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌కు వ్యతిరేకంగా ఎన్‌‌‌‌జీటీలో గౌరీ అనే ఏనిమల్‌‌‌‌ యాక్టివిస్ట్‌‌‌‌ పిటిషన్ వేశారు.  లోకల్ అథారిటీలకు అధికారాన్ని ఇవ్వడాన్ని కూడా ఆమె వ్యతిరేకించారు. గైడ్‌‌‌‌లైన్స్ ప్రకారం, లక్షకు పైగా కోళ్లు ఉంటేనే వాటర్(ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్) యాక్ట్, 1974 సెక్షన్ 25 కింద అనుమతి కావాలి. 2,500 కోళ్లు ఉండే పౌల్ట్రీలకు లోకల్‌‌‌‌ ఆఫీసర్ల అనుమతి చాలు.  పౌల్ట్రీ వల్ల విపరీతంగా కాలుష్యం ఏర్పడుతోందని కూడా ఆమె పిటిషన్‌‌‌‌లో పేర్కొన్నారు. కోళ్ల వ్యర్థాలు కూడా పేరుకుపోతాయని తెలిపారు.  కోళ్లకు  యాంటీబయోటిక్స్ ఇవ్వడం వల్ల కూడా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని, ఆ బర్డ్స్‌‌‌‌ను లేదా ఎగ్స్‌‌‌‌ను తినే వారి ఆరోగ్యానికి ప్రమాదమని ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా ఎన్‌‌‌‌జీటీ ఛైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ జస్టిస్ ఏకే గోయల్ మాట్లాడుతూ ‘‘అన్ని రాష్ట్రాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల పర్యావరణ నిబంధనలకు కచ్చితంగా కట్టుబడి ఉండాలి. నీటికి, గాలికి, భూమికి ఏదైనా హాని తలపడుతుందంటే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. సస్టైనబుల్ డెవలప్‌‌‌‌మెంట్ అనేది జీవించే హక్కులో భాగం. సస్టైనబుల్ డెవలప్‌‌‌‌మెంట్ కాన్సెప్ట్ కింద పర్యావరణాన్ని కాపాడే బాధ్యత రాష్ట్ర అథారిటీలపై ఉంది.  అంతర్జాతీయ సమావేశాలతో వాటర్ యాక్ట్, ఎయిర్‌‌‌‌‌‌‌‌ యాక్ట్, ఎన్విరాన్‌‌‌‌మెంట్(ప్రొటెక్షన్) యాక్ట్‌‌‌‌లు వచ్చాయని చెప్పింది’’ అని పేర్కొన్నారు.

గత కొన్నేళ్లుగా మేము నీరు, ఎరువులు వంటి వాడకాన్ని 30 శాతం వరకు తగ్గించుకున్నాం. మా ఇండస్ట్రీ వల్ల పర్యావరణానికి నష్టం ఉండదు. కాలుష్యం ఏర్పడదు. మేం అన్ని స్టాండర్డ్స్‌‌ను పాటిస్తున్నాం. గౌరి ఆరోపణల్లో నిజం లేదు. ప్రస్తుతం ఎన్‌‌జీటీ ఇచ్చిన ఆర్డర్ల వల్ల చిన్న వ్యాపారాలు దెబ్బతింటాయి. కోళ్ల పెంపకందారులకు వ్యాపార నిర్వహణ ఖర్చులు ఇంకా పెరుగుతాయి. ఎన్జీటీ తీర్పుతో చిన్న వ్యాపారాలు దెబ్బతింటాయి. కోర్టు మా వాదనను వినకుండానే ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ ఈ విషయంపై మేము ఆందోళన చెందట్లేదు. ఇండస్ట్రీ దీన్ని చాలా ఈజీగా పరిష్కరిస్తుంది.  కోళ్లు తక్కువ ధాన్యంతోనే ఎక్కువ గుడ్లు పెడుతున్నాయి. దీని వల్ల వేల టన్నుల కార్బన్ ఎమిషన్స్‌‌ సేవ్ అవుతున్నాయి. గ్రీన్ హౌజ్ గ్యాస్ ఎమిషన్స్ కూడా బాగా తగ్గాయి. -సురేష్ నాయుడు చిట్టూరి, శ్రీనివాస ఫార్మ్స్

ఈ తీర్పుతో మాకు  నష్టం

ప్రస్తుతం ఎన్‌‌జీటీ ఇచ్చిన ఆర్డర్స్ చిన్న వ్యాపారులను దెబ్బతీసే విధంగా ఉన్నాయని పౌల్ట్రీ ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి.    ఇంజెక్షన్ల వాడకం చాలా వరకు తగ్గించామని పేర్కొంటున్నాయి. పౌల్ట్రీ ఇండస్ట్రీ కాలుష్యానికి కారణమవుతుందనే వాదనను నిరూపించేందుకు ఎలాంటి సైంటిఫిక్‌‌ ఎవిడెన్స్‌‌ లేదని చెబుతున్నాయి. పర్యావరణానికి అనుకూలంగానే తాము పౌల్ట్రీపరిశ్రమలను నడుపుతున్నామని అంటున్నాయి. ఈ ఆర్డర్​ వల్ల  చిన్న వ్యాపారుల  ఖర్చు పెంచడం తప్ప మరేమీ జరగదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఎరువుల వాడకం అనేది ప్రపంచమంతా వాడుతూనే ఉందని, దాని వల్ల ఎక్కడా కూడా ఇబ్బందులు లేవని ఇండస్ట్రీ వర్గాలు విమర్శించాయి.