Telangana Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 80 శాతం సీట్లు గెలుస్తుంది: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Telangana Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 80 శాతం సీట్లు గెలుస్తుంది: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు మరి కొన్ని గంటలు మాత్రమే సమయం ఉన్న క్రమంలో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ప్రధాన పార్టీలన్నీ గెలుపు తమదే అన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ( ఫిబ్రవరి 10 ) ఖమ్మంలోని SR గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో మీడియాతో మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 శాతం సీట్లను గెలుస్తుందని అన్నారు. 

రెండున్నరేళ్లలో చెప్పిన ప్రతి పనీ చేశామని.. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమంగా ముందుకు పోతున్నామని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు మిత్తి ఈ ప్రభుత్వం కడుతుందని అన్నారు. పార్లమెంట్, బై ఎన్నికలు, గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసాం కాబట్టే ప్రజలు మమ్మల్ని గెలిపిస్తున్నారని అన్నారు పొంగులేటి.

ప్రతి పక్ష నేతలు వాడు, విడూ అనే సంస్కృతి తప్పు పడుతున్నానని.. ప్రజలు కూడా తప్పు పడతారని అన్నారు.ఆ తప్పును గమనించిన ప్రజలు మునిసిపల్ ఎన్నికల్లోబుద్ది చెబుతారని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.జూబ్లీహిల్స్ ఎన్నికలే రెఫరాండ అని.. ప్రజలే సమాధానం ఇచ్చారని అన్నారు పొంగులేటి.

ఈ మునిసిపల్ ఎన్నికల్లో ఫలితాలు ఎట్ల వస్తున్నాయో గమనించిన మేధావులు ఇప్పుడు సైలెంట్ అయ్యారని...పేదల కోసం ఈ ప్రభుత్వ నిరంతరం పరితపిస్తుందని అన్నారు. గత ప్రభుత్వం దొరల ప్రభుత్వం ఆ ప్రభుత్వం కుక్కలు, పందులు తినే దొడ్డు బియ్యం ఇచ్చారని అన్నారు.

కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం లో పేదలకు సన్న బియ్యం ఇస్తున్నామని... సుమారు 4లక్షల ఇల్లు పేదలకు ఇచ్చామని... ఎక్కడకి పోయిన నేడు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో విడతలవారిగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని... ముఖ్యమంత్రి సుచనాలతో ప్రణాళికలు సిద్ధం చేస్తన్నామని అన్నారు పొంగులేటి.