22-ఏపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి : పొంగులేటి సుధాకర్ రెడ్డి 

22-ఏపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి : పొంగులేటి సుధాకర్ రెడ్డి 
  • బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో 22-ఏ నిషేధిత ఆస్తుల జాబితాకు సంబంధించిన సమస్యలపై శ్వేత పత్రం రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తి హక్కులు, భూ రికార్డుల్లో పారదర్శకత, బాధితులకు సత్వర పరిష్కారం కోరుతూ శనివారం హైదరాబాద్‌‌‌‌లోని ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించనున్నట్టు ఓ ప్రకటనలో చెప్పారు.

కొన్ని ఆస్తులు పరిపాలనా తప్పిదాలతో 22-ఏ పరిధిలోకి వెళ్లినట్లు ప్రభుత్వమే అంగీకరిస్తున్న నేపథ్యంలో మొత్తం వివరాలను ఎందుకు వెల్లడించడం లేదని నిలదీశారు. డిసెంబర్ 2023 నాటికి ఉన్న భూ విస్తీర్ణం ఎంత, ప్రస్తుతం ఎంత ఉంది, కొత్తగా చేర్చినవి, తొలగించినవి ఎన్ని, జిల్లా వారీగా వివరాలు, వచ్చిన ఫిర్యాదులు, పెండింగ్ కేసుల సంఖ్య వంటి సమగ్ర సమాచారాన్ని ప్రజల ముందుంచాలని కోరారు.