సల్మాన్ తో డేటింగ్ వార్తలు.. నోరువిప్పిన స్టార్ హీరోయిన్

సల్మాన్ తో డేటింగ్ వార్తలు.. నోరువిప్పిన స్టార్ హీరోయిన్

పూజా హెగ్డే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ను ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.  లేటెస్ట్ గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్.. కిసీ కి జాన్ సిన్మాలో హీరోయిన్ గా నటించింది. ఫర్వాద్ సంజీ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో వెంకటేశ్, జగపతి బాబు, షెహనాజ్ గిల్, భూమిక నటిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ప్రస్తుతం  సిన్మా ప్రమోషన్ లో బిజీగా ఉంది పూజా హెగ్డే. ఇది కాకుండా మరో రెండు సిన్మాలు సల్మాన్ ఖాన్ తో చేస్తుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ తో తో పూజా హెగ్డే డేటింగ్ చేస్తుందంటూ మరోసారి బీ టౌన్ లో టాక్ వస్తోంది. 

లేటెస్ట్ గా సల్మాన్ తో డేటింగ్ వార్తలపై స్పందించిన పూజా వాటిని కొట్టిపారేసింది. ఇలాంటి వార్తలు తాను చదివానని ..ప్రజెంట్ తాను సింగిల్ గానే ఉన్నానని చెప్పింది. తనకు సింగిల్ గానే ఉండటం ఇష్టమని..తన ఫోకస్ అంతా కెరీర్ పైనే ఉందని తెలిపింది. డేటింగ్ వార్తలను తాను అసలు పట్టించుకోనని.. సల్మాన్ తో నటించడం తనకు ఒక గొప్ప అనుభవం అని చెప్పుకొచ్చింది. సల్మాన్ సెట్ లో చాలా ఫ్రీగా ఉంటాడని వెల్లడించింది. ఈ సిన్మాలతో తన క్యారెక్టర్ తెలుగు అమ్మాయి పాత్ర అని అందుకే ఇష్టంగా చేశానంది.